calender_icon.png 31 October, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్‌విండోలు బలోపేతం కావాలి

31-10-2024 12:00:00 AM

ఎమ్మెల్యే సత్యనారాయణ 

మానకొండూర్, అక్టోబర్ 30: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ఆర్థికంగా బలోపేతమైతే రైతులకు మేలు జరుగుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనా రాయణ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు, రిటైల్ అవుట్‌లెట్‌ను కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగిల్ విండోల అభివృద్ధిలో సంఘ సభ్యులు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వాహనదారులు, ట్రాక్టర్లు యజమానులు, సంఘ సభుయలు ఈ బంక్ ఇంధనం వాడాలని కోరారు. సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.