07-03-2025 05:34:26 PM
ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపిన పాలకవర్గం సభ్యులు
మద్నూర్,(విజయక్రాంతి): సింగిల్ విండో పాలకవర్గం పదవి కాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల పాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ సింగిల్ విండో పాలకవర్గం ఆరు మాసాల పాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. పాలకవర్గం పదవీకాలం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు మద్నూర్ సింగిల్ విండో కార్యాలయంలో విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.. మరో ఆరు మాసాల పాటు వ్యవసాయ రైతులకు పాలకవర్గం సేవలందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విండో కార్యదర్శి బాబురావ్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.