21-04-2025 11:20:11 PM
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతును అగ్రభాగాన నిలుపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బిట్టుపల్లి, గద్దలపల్లి, గోపాల్ పూర్, చిన్న ఓదాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం దేశం గర్వించే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.
ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు క్వింటాళ్ కు రూ.500బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ లాంటి తదితర పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని రైతులు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, నాయకులు అక్కపాక సదయ్య, చంద్రు రాజమల్లు, దొరగొల్ల శ్రీనివాస్, నాగుల రాజయ్య, మేడ రాజయ్య, వేముల లక్ష్మయ్య, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.