15-03-2025 12:02:26 AM
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడం తో శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి ప్రారంభం నుంచే పగటి ఉష్ణోగ్రతలు మండుతున్నాయి. బయట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే మా ర్చి 15 నుంచి పాఠశాలల చివరి పనిదినం (ఏప్రిల్ 23వ తేదీ) వరకు అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలు కాను న్నా యి.
పాఠశాలలు ఉదయం 8 నుంచి మ ధ్యాహ్నం 12.30 వరకు పనిచేయనున్నాయి. 12.30కు మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇండ్లకు పంపాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. అలాగే పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి.
ఈనెల 21 నుంచి పది పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూళ్లను నడపనున్నారు.