calender_icon.png 15 January, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరి జంటలే టార్గెట్!

23-09-2024 12:28:41 AM

  1. ఫొటోలు తీస్తూ వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్? 
  2. అవమానభారంతో దంపతుల ఆత్మహత్యాయత్నం 
  3. అలస్యంగా వెలుగు చూసిన బాగోతం

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కంచే చేను మేసినట్టు.. ఆపదలో ఉ న్నవారిని కాపాడాల్సిన పోలీసులే అధికారా న్ని అడ్డం పెట్టుకుని చిల్లర డబ్బులకు కక్కుర్తిపడి సామాన్యులను బెదిరింపులకు పాల్ప డుతున్నారు. కొత్త సమస్యలను సృష్టించి వా రిని ఆపదలోకి నెడుతూ ఆత్మహత్యాయత్నాలకు పాల్పడేలా వేధిస్తున్న కొందరు కానిస్టే బుళ్ళ బాగోతం ఆలస్యంగా వెలుగుచూసిం ది. వివరాల్లోకి వెళ్తే.. బిజినేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి గత మే 15న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లోని నల్లవెల్లి రోడ్డులోగల ప్రధాన రహదారిపై కారు నిలుపుకొని కారులో భోజనం చే స్తున్నారు.

దీంతో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబు ల్ ఫొటోలు తీసి కారును అభ్యంతరకర స్థల ంలో నిలిపారంటూ.. కారులో ఉన్నది ఎవ రూ? అంటూ గద్దించి వారిని కొత్తచట్టాల పే రుతో భయభ్రాంతులకు గురిచేశారు. రూ.10 వేలు ఇవ్వాలని, లేదంటే కేసులు న మోదు చేయిస్తానంటూ బెదిరించాడు. చివరికి బాధితుడు తన వద్ద ఉన్న రెండు వేల రూపాయలు కానిస్టేబుల్ స్నేహితుడి ఫోన్‌ఫేకి ట్రాన్ఫర్ చేశాడు. అనంతరం కొద్దిరో జుల కిత్రం ట్యాబ్‌లో తీసిన ఫొటోను మళ్లీ చూపెడుతూ బిజినేపల్లి మండలంలో ని వాసం ఉంటున్న అదే పోలీస్ స్టేషన్ పరిధి లో పనిచేసే మరో కానిస్టేబుల్ బెదిరిపింపులకు పాల్పడ్డాడు.

తనవద్ద డబ్బులు లేవం టూ ప్రాదేయపడ్డా, విడిచిపెట్టకుండా బాధితుడి ఇంటికి వెళ్లి భార్యకు ఫొటోలను చూపి స్తూ వారి మధ్య అనుమానాలను రేకిత్తించా డు. ఇప్పటికైనా డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్‌మీడియాలో ఫొటోలను పెడతాన ంటూ బెదిరించాడు. చివరకు బాధితుడి భా ర్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం భర్త కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి ఇరువురికి పెద్దలు సర్దిచెప్పే క్రమ ంలో అసలు విషయం వెలుగులోకి రావడం తో జిల్లాలో కలకలం రేపుతుంది. 

కానిస్టేబుల్‌పై గతంలోనూ భూకబ్జా ఆరోపణలు 

ఉమ్మడి పాలమూరు జిల్లా నవాబుపేటకు చెందిన ఆరోపణలు ఎదుర్కొ ంటున్న కానిస్టేబుల్ గతంలో ఆర్మీలో ప నిచేశాడు. అనంతరం తిరిగి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బిజినపల్లి మండలంలోనే నివాసముంటూ అదే మండల స్టేషన్‌లో పనిచేశాడు. గతేడాది ఆగస్టులో తన మామ బంధువుల ప్లాట్ కబ్జాచేసి మహిళను చావబాదాడు. అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేయడంతో తన పరపతిని వినియోగించి కేసు నమోదు కాకుండా చక్రం తిప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు తప్పలేదు. అయి నా, తనపై పోలీసులు అధికారులు ఎ లాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. తిరిగి నాగర్‌కర్నూల్ పోలీ స్ స్టేషన్ పరిధిలోనూ మరో కానిస్టేబుల్‌తో కలిసి సెటిల్‌మెంట్లు, భూతగా దాల్లో కలుగజేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం 

డయల్ 100 ఫిర్యాదులు, లేదా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ సిబ్బంది ఎవరైనా డబ్బులు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఈ విషయాలను పైఅధికారుల దృష్టికి తీసుకువెల్లి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం.

 గోవర్ధన్, ఎస్సై, నాగర్‌కర్నూల్