calender_icon.png 31 October, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ ఇచ్చిన రైతుకు.. రైతుభరోసా ఎందుకు ఇవ్వరు?

17-07-2024 12:31:50 PM

హైదరాబాద్: రుణమాఫీ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆదాయం బావుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు, రుణమాఫీకి రెండింటికీ పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికత. పాస్ బుక్ ప్రామాణికత అయినప్పుడు రైతుభరోసా ఎందుకు ఇవ్వరు? అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ ఇచ్చిన రైతుకు, రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతుభరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ ఒకే విడుతలో అమలు చేస్తామని గతంలో సీఎం చెప్పారు. రుణమాఫీకి అర్హులైన రైతుల లెక్కలు ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు? అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 29వేల కోట్లు షరుతులు లేకుండా మాఫీ చేశామన్నారు.