calender_icon.png 23 October, 2024 | 1:51 PM

ప్రముఖ గాయని భర్త కన్నుమూత

09-07-2024 12:03:35 PM

ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాం నెలకొంది. ఆమె భర్త జాని చాకో ఉతుప్ (78) మృతి చెందాడు. సోమవారం రాత్రి కోల్ కతాలోని వారి నివాసంలో టీవీ చూస్తోన్న ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు హుటాహుటిని స్థానిక దవాఖానకు తరలించారు. కానీ జాని చాకూ అప్పటికి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

జాని చాకూ ఉతుప్, ఉషా ఉతుప్ దంపతులకు ఇద్దరు పిల్లలు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. కుమార్తె అంజలి తన సోషల్ మీడియాలో తండ్రి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'నాన్న.. మిమ్మల్ని అందరినీ వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. నువ్వు ఎంతో స్టైలిష్ గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి మీరూ. మేము మీమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అంటూ రాసుకొచ్చారు. జాని చాకో ఉతుప్ అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి.