calender_icon.png 20 September, 2024 | 9:56 PM

ఘనంగా సాయి చందు జయంతి వేడుకలు

20-09-2024 07:58:30 PM

రాజాపూర్,(విజయక్రాంతి): రాజాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గాయకుడు సాయి చందు జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సాయి చందు చేసిన సేవలను గుర్తుచేస్తూ అమరహే సాయి చందు అంటూ నినాదలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ కుమార్, యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి వెంకటేష్, ఆనంద్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ లు ఆర్.యాదగిరి, శ్రీను నాయక్, కిషంజీ, ఎంపీటీసీ శేఖర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్, అల్లే శ్రీనివాస్,హతీరం, శ్రీనివాస్,బీసీ సెల్ శేఖర్, నర్సిములు, నరసింహ, రంజిత్, ముస్తఫ్ఫా నజీమ్, నవీన్, పల్లె రవి, శేఖర్, మల్లేష్, లక్సయ్య, చంద్రయ్య అనిల్ కుమార్ పాల్గొన్నారు.