calender_icon.png 25 January, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగర్ మంగ్లీ బాయి నేరల్ తండాలో సందడి

24-01-2025 10:44:10 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండా గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్ బస్సి గంగుబాయి ప్రకాష్ నాయక్  ఇంటికి సినిమా సింగర్ మంగ్లీ బాయి శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా వారు మంగ్లీ బాయ్ ని  సన్మానించి స్వాగతం పలికారు. ఆమెను తెలంగాణ రాష్ట్ర లాభన అధ్యక్షులు బస్సి తాన్ సింగ్ నాయక్, గాంధారి  మాజీ వైస్ ఎంపీపీ భజన్ లాల్, గాంధారి స్థానిక సోసైటీ డైరెక్టర్ రాథోడ్ నెహ్రూ, స్థానిక మాజీ ఉప సర్పంచ్ బస్సి నర్సింగ్, బస్సి రవీందర్, రాథోడ్ సుభాష్, జీవన్ సేట్, దారావత్ రవీందర్, బస్సి నరేందర్ తదితరులు సన్మానించారు.