రామగుండం (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ గాయని మధుప్రియ ఓ వివాదంలో చిక్కుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఏకంగా గర్భగుడిలో ఇటీవల మధుప్రియ ఓ వీడియో పాటను చిత్రీకరించింది. దీంతో అక్కడి భక్తులు, పలువురు దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పరమ పవిత్రమైన కాలేశ్వరం దేవస్థానం గర్భగుడిలో ఫోటోలు తీయడానికి ఇలాంటి అనుమతులు లేవు. అయితే గాయని మధుప్రియ దర్శన వేళలో గర్భగుడిలో ఏకంగా వీడియో సాంగ్ షూటింగ్ చేసినందుకు పర్యవసానంగా దేవాదాయ శాఖ అధికారులు ఆ ఆలయ ఈవో మారుతిపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదే సమయంలో వీధిలో ఉన్న అర్చకుడు రామకృష్ణకు కూడా నోటీసులు జారీ చేశారు. కాగా, జానపద గాయకురాలిగా సినీ పరిశ్రమలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మధుప్రియ ఇటీవలనే ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలుకవే అనే పాపులర్ సాంగ్ పాడే ఛాన్స్ దక్కించుకొని మరింత పాపులర్ అయిన మధుప్రియ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం గోదావరిఖనిలో చర్చని అంశంగా మారింది.