calender_icon.png 5 March, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయని కల్పన ఆత్మహత్యాయత్నం

05-03-2025 12:29:08 AM

  1. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి.. 
  2. విషమంగా ఆరోగ్య పరిస్థితి

కూకట్‌పల్లి, మార్చి 4: ప్రముఖ గాయని కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి  పాల్పడింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. కల్పన నిజాంపేట రోడ్డులోని వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్‌లో నివాసం ఉంటుంది. గత రెండు రోజులుగా ఇంటి తలుపు తీయకపోవటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసు లు వచ్చి తలుపును తెరిచి లోనికి వెళ్లి చూడ గా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్న ది. హుటాహుటిన స్థానికుల సహాయంతో పోలీసులు నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.