04-03-2025 11:00:50 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): ప్రముఖ సింగర్ కల్పన తన నివాసంలో ఆత్మహత్య హత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. కల్పన నిజాంపేట రోడ్డులోని వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్ లో నివాసం ఉంటుంది. గత రెండు రోజులుగా ఇంటి తలుపు తీయక పోవటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా డోర్ తీసుకొని లోనికి వెళ్ళగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. హుటా హుటిన స్థానికుల సహాయంతో పోలీసులు నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమెను ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం పరిస్తితి విషమంగా ఉన్నట్లు వైద్యులు అనధికారికంగా సమాచారం వెల్లడించారు.