20-03-2025 01:52:49 AM
ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
మందమర్రి, మార్చి 19 : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికుల సొంతింటి కళ త్వరలోనే సాకారం అవుతుందని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు పేజ్ బోర్డ్ కమిటీ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. ఏరియాలోని కేకే 5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు.
ఈనెల 7న సింగరేణి సిఎండి బలరాంతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు సమస్యలపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని పెరక్స్ పై ఆదాయ పన్ను. సొంత ఇంటి పథకం లాంటి కొన్ని సమస్యలు పరిష్కారం కోసం కమిటీలు వేసేందుకు అవగాహన కుదురందని ఆన్నారు. హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు, హైదరాబాదులో ఉన్న రిటైర్డు కార్మికులకు సింగరేణి భవన్లో మందులు పంపిణీ చేసేందుకు అంగీకారం కుదిరిందని ఆన్నారు.
డిస్మిస్డ్ కార్మికులకు 5 సంవత్సరాలలో ఏదైనా ఒక సంవత్సరంలో 100 మస్టర్లు ఉంటే వారికి ఒక అవకాశం లోక్ ఆదాలత్ తీర్పు ప్రకారం ఇచ్చుటకు, డిస్మిస్ అయిన జెఎంఈటిలందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం కుదిరిందనీ ఆయన వివరించారు. సొంత ఇల్లు ఉన్న వారికి క్వార్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం, మైనింగ్ స్టాప్, ట్రేడ్ మేన్స్ మెడికల్ అన్ఫిట్ అయిన వారికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇచ్చుటకు అంగీకరించా రనీ తెలిపారు. సింగరేణిలోని సత్తుపల్లి, ఇల్లందు గనులకి సంబంధించిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడి ఈ టెండర్లను రద్దు చేయవలసిందిగా కోరారు. టెండర్ల రద్దు కోసం సమ్మె చేసైనా సరే హక్కులు సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు యూని యన్ లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించా రు. బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారా యణ, ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్, గని ఇన్చార్జి కంది శ్రీనివాస్, పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్, ఏరియా నాయకులు బాణయ్య, ఆంటోని దినేష్, దేవసాని సాంబయ్య, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్ విక్రమ్ సింగ్, కుమారస్వామి, వరప్రసాద్, ముల్కల వెంకటేశ్వర్లు, పిట్ కార్యదర్శులు శర్మ, యాదవ్, సంజీవ్, కుమార్, కలువల శ్రీనివాస్, ప్రేమ్ లాల్ , మేకల సంతు, ఊదరి శ్రీకాంత్, పంగ చంద్రశేఖర్, కన్నం వేణు,బుక్య రాజేందర్, ధారావత్ రాజ్ కుమార్, భగవాన్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీకాంత్, సాదుల సంపత్ లు పాల్గొన్నారు.