బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఫ్లై ఓవర్ పై ఆదివారం రాత్రి కంశెట్టి కిరణ్ కుమార్ (45) అనే సింగరేణి కార్మికుడు బైక్ డివైడర్ ను ఢీకొని కింద పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు కాసిపేట-2 గనిలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ సంఘటనపై బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.