calender_icon.png 14 January, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు కింద పడి సింగరేణి కార్మికుని ఆత్మహత్య

05-11-2024 08:35:11 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మూడో జోన్ కి చెందిన సింగరేణి కార్మికుడు గురజాల మొగిలి(60) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మందమర్రిలోని మూడో జోన్ కు చెందిన గురిజాల మొగిలి (60) రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్ పై గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు మందమర్రి ఏరియాలోని కేకే ఓసిపిలో విధులు నిర్వహిస్తున్నాడు.ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.