calender_icon.png 13 January, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి సింగరేణి రూ.88.55 కోట్ల డివిడెండ్

13-01-2025 03:09:26 AM

సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు అందజేసిన సీఎండీ బలరాం

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సంస్థ 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.88.55 కోట్లు డివిడెండ్‌ను చెల్లిం చింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి డివిడెండ్ చెక్కు అందిం చారు.

సింగరేణి కాలరీస్ చెల్లింపు మూలధ నం (పెయిడ్ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్)లో 10 శాతాన్ని డివిడెండ్‌గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం దాదాపుగా రూ.173 కోట్లకు గానూ సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.88.55 కోట్లు డివిడెండ్‌గా చెల్లించారు.

సింగరేణి సంస్థల కార్మికులకు లాభాల వాటా చెల్లించడమే కాకుండా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి డివిడెండ్‌లు చెల్లించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క అభినందించారు. కార్యక్రమంలో మంత్రి జూప ల్లి కృష్ణారావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇం ధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.