calender_icon.png 18 March, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సూపర్ బజార్‌కు మహర్దశ

18-03-2025 01:05:06 AM

కవితా నాయుడు

కొత్తగూడెం, మార్చి17 (విజయక్రాంతి ) సమిష్టిగా పనిచేసి సింగరేణి సూపర్ ను అభివృద్ధి పథంలో నడిపించాలని జియం పర్సనల్ ఐ ఆర్, పీఎం అండ్ వెల్ఫేర్ కవితా నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సింగరేణి సూపర్ బజారుపై ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు.

సింగరేణి సూపర్ బజారును అభివృద్ధి పథంలో నడిపించడం , డిజిటల్ పేమెంట్స్ పై దృష్టి సారించడం,  అన్ని రకాలైనప్రొవిజన్స్ అందుబాటులో ఉంచడం,  ఉద్యోగులకు అవసరమైన   వస్తువులు అందుబాటులో ఉంచుతూ, సేల్స్ పెంచాల్సిందిగా అధికారుల ఆదేశించారు.సింగరేణి సూపర్ బజార్ యాజమాన్యానికి, అవసరమైన సహాయ సహకారాలు, సింగరేణి తరపున అందిస్తామన్నారు.

ఈ సమావేశంలో, ఎండి సూపర్ బజార్ శ్రీ విలాస్ శ్రీనివాస్,కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ శ్రీ సిహెచ్ అశోక్,  గోదావరిఖని   శ్రీరాంపూర్ డివిజనల్ మేనేజర్స్ శ్రీ నరేన్ చక్రవర్తి, పి రాజు, మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ శ్రీ ప్రసాద్, ఈ సమావేశంలో పాల్గొని   పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు