calender_icon.png 12 March, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో సింగరేణి విద్యార్థుల ప్రతిభ

12-03-2025 05:41:12 PM

భద్రాద్రి,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ(Singareni Collieries Educational Society) ఆధ్వర్యంలో నడపబడుతున్న 9 సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలల్లో విద్యా సంవత్సరం 2024 -25 లో యూనిఫైడ్ కౌన్సిల్ వారిచే గత జనవరి నెల 30వ తారీఖున నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్  నందు అన్ని పాఠశాలల నుండి 533మంది  విద్యార్థులు పాల్గొన్నారు. పదవ తేదీ న ఫలితాలు విడుదల చేశారు. కొత్తగూడెం సింగరేణి పాఠశాల నుండి 114  విద్యార్థులు పాల్గొనగా వారిలో 20మంది గోల్డ్ మెడల్ సాధించారు.  ముగ్గురు విద్యార్థులు క్యాష్ అవార్డు  2000 రూపాయలు  గెలుచుకున్నారు. మణుగూరు పాఠశాల నుండి 84 మంది విద్యార్థులు పాల్గొనగా 13 మంది గోల్డ్ మెడల్ సాధించారు. ఇల్లందు పాఠశాల నుండి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భూపాలపల్లి పాఠశాల నుండి 52 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరిఖని సెక్టర్ 3 పాఠశాల నుండి 70 మంది  విద్యార్థులుపాల్గొన్నారు. వారిలో 8 మంది  గోల్డ్ మెడల్స్ సాధించారు. గోదావరిఖనిలోని  సెక్టార్ 2పాఠశాల నుండి 34 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సిసిసి నస్పూర్ పాఠశాల నుండి 49 మంది విద్యార్థులు పాల్గొన్నగా, ఆరుగురు గోల్డ్ మెడల్ సాధించారు. మందమర్రి పాఠశాల నుండి 83 మంది విద్యార్థులు, గొల్లేటి  పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు పాల్గొన్ని ఒక విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఒలంపియాడ్ కార్యక్రమాన్ని అన్ని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలల చీఫ్ కోఆర్డినేటర్ గా డి ఫుాల్ సింగ్  సీనియర్  గణిత  ఉపాధ్యాయుడు  వ్యవహరించారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో రెండు ఒలంపియాడ్ లో సుమారు 1000  మంది విద్యార్థులు పాల్గొని, సమర్థవంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించారు. అన్ని  సింగరేణి పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఒలంపియాడ్ ఇన్చార్జి ఉపాధ్యాయులను, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్(Singareni Collieries Educational Society Secretary Gunda Srinivas), జాయింట్ సెక్రెటరీ కె సునీల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇది నిరంతరం ప్రతి పాఠశాలలో రాబోయే సంవత్సరాలలో కూడా కొనసాగుతుందని వివరించారు. రానున్న కాలంలో ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, విద్యార్థులలో మంచి క్రమశిక్షణ ఒరవడి,మంచి ఫలితాలు సాధిస్తారని ఆశించారు.