calender_icon.png 3 April, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం కేటాయించిన భూమిని సింగరేణి తీసుకోవద్దు

01-04-2025 11:19:57 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత కలేక్టరెట్ సముదాయంలో ఇటీవల జరిగిన ఎస్సీ, ఎస్టీ రివ్యూ మీటింగ్ లో బెల్లంపల్లి మండలంలోని కాసిరెడ్డి పల్లెకి చెందిన కుశ్నపల్లి రాజలింగు తనకు ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ భూమిలో సింగరేణి యాజమాన్యం చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణి కుంట్ల ప్రవీణ్ మంగళవారం మందమర్రి ఏరియా జీఎం దేవందర్, ఎస్టేట్ అధికారులతో కలిసి భూమిని పరిశీలించారు.  ప్రభుత్వం పునరావసం కింద కేటాయించిన భూమిని తిరిగి సింగరేణి తీసుకోవద్దని కోరారు. సమస్య పరిష్కారానికి సింగరేణి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.