calender_icon.png 1 March, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ జోక్యం నుండి సింగరేణిని సంరక్షించాలి

01-03-2025 05:42:07 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు రాజారెడ్డి..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం రోజురోజుకు పెరిగిపోతుందని ఇది సంస్థ మనుగడకు ప్రమాదకరమని రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి సంస్థను సంరక్షించేందుకు యూనియన్ల కతీతంగా అన్ని కార్మిక సంఘాలు కృషి చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కోరారు. ఏరియాలోని కాసిపేట 2 గనిపై శనివారం నిర్వహించి న కార్యక్రమంలో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్స్ తో కార్మిక సంఘాల మనుగడకే ప్రమాదం  ఉన్నందున యూనియన్లన్నీ తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి యూనియన్ వ్యవస్థను కాపాడుకొని, రాజకీయ జోక్యం నుండి సంస్థను కాపాడి భవిష్యత్తు తరాలకు సింగరేణి సంస్థ మనుగడ సాధించేలా అన్ని యూనియన్లు ఏకమై ముందుకు రావాలన్నారు.

ఇప్పటికే రాజకీయ జోక్యంతో యాజమాన్యం సైతం ఎటు తేల్చుకోలేకపోతున్నదని సంస్థ ఆర్థికంగా నష్టాల్లోకి పోయి ఖాయిలా పరిశ్రమగా మారే అవకాశం ఉన్నందున గుర్తింపు సంఘం అన్ని యూనియన్లను సమన్వయం చేసుకుంటూ పోరాటానికి రూపకల్పన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధాంతపరంగా విధానాల పరంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్న సంస్థ రక్షణ కొరకు కార్మికుల సంక్షేమం కొరకు యూనియన్లు ఏకమవ్వాలని కార్మిక వర్గాన్ని పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం యూనియన్లకు ఎంతైనా ఉన్నందున కార్మికులందరూ భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుపాలని ఆయన కోరారు. కార్మిక సమస్యలపై యాజమాన్యాన్ని గెలిచిన సంఘాలను ప్రశ్నించకుండా కోడ్ ఆఫ్ డిసిప్లెన్ ను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష యూనియన్ లను అడ్డుకోవడం సరికాదన్నారు. సంస్థను కాపాడుకోవడానికి లేబర్ కోడ్ల వల్ల జరిగే ప్రమాదాన్ని కార్మికులకు వివరిస్తూ కార్మికులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) సింగరేణి కార్మికుల సొంతింటి కళ సాకారంతో పాటు ఇతర అంశాలపై చేస్తున్న పోరాటాన్ని గుర్తించిన కాసిపేట్ 2 గనికి చెందిన కార్మికులు స్వతహాగా యూనియన్ లో చేరడానికి పదుల సంఖ్యలో ముందుకు రాగా వారికి యూనియన్ కండువాకప్పి వేజ్ బోర్డు బుక్ అందించి యూనియన్ లోకి ఆహ్వానించారు. కాగా యూనియన్ లో చేరిన వారిలో ధరన్, రాజేష్, వంశీకృష్ణ, యశ్వంత్, స్వామి, శ్రీకాంత్, జాకీర్, ప్రవీణ్, శ్రావణ్, లు ఉన్నారు. యూనియన్ లో చేరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్, రాష్ట్ర నాయ కులు అరేపల్లి రాజమౌళి, నరహరి రావు, సీనియర్ నాయకులు అలువాల సంజీవ్, ఫిట్ సెక్రటరీ బుద్దె సురేష్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్, మైన్ కమిటీ సభ్యులు కనకం రమేష్, అర్గనైజర్ రాజకుమార్, సురేష్, నాగరాజు, ప్రదీప్, మనోజ్, ప్రశాంత్, శ్రీనివాస్ కుమారస్వామి, రమేష్, శ్రీకాంత్, శ్రావణ్, రాజేష్, యశ్వంత్ లు పాల్గొన్నారు.