జిఎం (ఎడ్యుకేషన్) శ్రీనివాస్..
మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి పాఠశాలలు ఉన్నతమైన ప్రామాణాల విద్యకు నిలయాలని సింగరేణి యాజమాన్యం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలతో ఉన్నతమైన విద్యతోపాటు వైజ్ఞానిక సృజనాత్మకతను విద్యార్థులకు అందిస్తున్నాయని జిఎం (ఎడ్యుకేషనల్) అండ్ సెక్రటరీ గుండా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాత్రి మణుగూరు ఏరియాలోని పివి కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాల 47వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదువుతూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించి ఉపాధ్యాయులకు చదువుకున్న పాఠశాలకు పేరు ప్రతిష్టలు పెంచాలని సూచించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మణుగూరు ఇంచార్జ్ జిఎం టి లక్ష్మీపతి గౌడ్ డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్ పాఠశాల హెచ్ఎం స్వరూపారాణి సిబ్బంది శ్రీదేవి, కళ్యాణి, అనురాధ, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.