మంత్రి నివాసంలో మంత్రికి వినతి పత్రంలో నిర్వాసితులు
రామగిరి(విజయక్రాంతి): లద్నాపూర్ సింగరేణి నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పరిష్కరించాలి హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నివాసం లో మంత్రికి వినతి పత్రంలో నిర్వాసితులు పేర్కొన్నారు. రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామంలోని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మంత్రి మాట్లాడుతూ... గ్రామంలోని సమస్యలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యను తొందరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ యూత్ మంథని అసెంబ్లీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొగరి లింగయ్య తాళ్ల పెళ్లి చంద్రయ్య పొన్నం సత్యనారాయణ. తాటి శ్రీనివాస్, జమీల్. గొర్రె ప్రకాష్ గండి ప్రశాంత్ వీర గొని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.