calender_icon.png 26 November, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి క్రీడాకారులు కోలిండియాలో సత్తా చాటాలి

06-11-2024 03:57:34 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మిక క్రీడాకారులు కొలిండియా స్థాయి పోటీలో పాల్గొని సత్తా చాటి సింగరేణి ఖ్యాతిని కోల్ ఇండియాలో నిలబెట్టాలని ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ కోరారు. బుధవారం పట్టణంలోని సింగరేణి హై స్కూల్ మైదానంలో నిర్వహించిన కంపెనీ స్థాయి ఫుట్ బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు కుంగిపోకుండా క్రీడల్లో మెలకువలు పాటించి విజయం సాధించాలని సూచించారు. కార్మిక క్రీడాకారులు కంపెనీ స్థాయి ఆటల పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏరియాకు సింగరేణి సంస్థకు పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించిన ఫుట్ బాల్ పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా జట్టు విజయం సాధించగా, రన్నర్స్ గా రామగుండం1,2 ఏరియా జట్టులు నిలిచాయి.

గెలుపొందిన, రన్నర్ గా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. విన్నర్స్ గా గెలిచిన శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులను అభినందించి కోల్ ఇండియా స్థాయిలో ఇదే స్ఫూర్తిని కొనసాగించి సింగరేణికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, నాయకులు దాగం మల్లేష్, సీఎమ్ఓఏఐ అధ్యక్షులు రమేష్, డబ్ల్యూపిఎస్ జిఏ గౌరవ కార్యదర్శి కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్పొరేట్ పాస్నేట్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, సీహేచ్ అశోక్, హెచ్ రమేష్, పి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ కృష్ణ, జనరల్ కెప్టెన్ సాక శ్రీనివాస్, అన్ని ఏరియాల క్రీడాకారులు, అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.