మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని టీడీపీ సెంటర్లో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి(Ambedkar Bronze Statue) సింగరేణి సంస్థ(Singareni Organization) ఆధ్వర్యంలో మెట్లు ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. మండల దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు సింగరేణి మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సానుకూలంగా స్పందించి విగ్రహానికి నిచ్చెన ఫ్లాట్ ఫామ్, మెట్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని ఆమెని ఇచ్చారు.
ఈ మేరకు జిఎం ఆదేశాలతో గత రెండు రోజులుగా సింగరేణి ఏరియా వర్క్ షాప్ ఇంజనీరింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాట్ ఫామ్, ఐరన్ నిచ్చెన మెట్లు స్టాండ్ పనులు చురుగ్గా ప్రారంభమై సోమవారంతో ముగిశాయి. విగ్రహం ఏర్పాటు నుండి అంబేద్కర్ జయంతి, వర్ధంతి నిర్వహణ సమయంలో విగ్రహానికి పూలమాలలు వేయడం ఇబ్బందికరంగా ఉండేది. గత మూడేళ్ల నిరక్షణకు ఏరియా జిఎం దుర్గం రామచందర్ స్పందించి వెంటనే హామీని పూర్తి చేయడం పట్ల అంబేద్కర్ వాదులు, దళిత బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.