calender_icon.png 20 March, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థకు ఆదరణ కరువైంది

20-03-2025 02:42:12 PM

సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి టి .మణిరాం సింగ్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి సంస్థకు ఆదరణ కరువైందని టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మని రామ్ సింగ్ అన్నారు.అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే ఇది అర్థమవుతుందన్నారు.రాష్ట్ర బడ్జెట్ కంటి తుడుపు చర్యలాగే ఉందని, రాష్ట్రంలోని ఏ రంగాలకు కూడా సరైన బడ్జెట్ను కేటాయించలేదని, ముఖ్యంగా సింగరేణి సంస్థకు, బడ్జెట్ కేటాయించకపోవడం  చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ సర్కార్ బడ్జెట్ విషయంలో పూర్తిగా విఫలమైందని, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీని నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపొందించలేదని ఆరోపించారు. విద్యా ,వైద్య రంగాలకు మొదటి ప్రధాన్యత ఇస్తానన్న రేవంత్ ప్రభుత్వం అందాల ఆస్కార్ పోటీలపైన చూపించే శ్రద్ద సింగరేణి సంస్థ  పైన చూపడం లేదని అన్నారు.

సింగరేణి సంస్థ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, తెలంగాణకే తల  మాణికంగా ఉన్న సింగరేణికి బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరమని, ఈ ప్రాంతం నుండి గెలిసిన ఎమ్మెల్యేలు కొత్త బావుల గురించి , కార్మికుల క్షేమం గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని రిటైర్డ్ కార్మికులకు ప్రస్తుత కార్మికులకు కనీస సౌకర్యాలు, ఏర్పాటు చేయాలని కోరారు. రిటైర్ కార్మికులకు అమలవుతున్న పెన్షన్ 19 99 నుండి 500 కు 600 పెన్షన్ వస్తున్న వారి గురించి ఎమ్మెల్యే లు ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే వారికి కనీస సౌకర్యాలకు పదివేల రూపాయలు వచ్చేటట్టుగా చూడాలన్నారు.

వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని, రిటైర్ కార్మికులకు కరెంటు ,నీటి సదుపాయం ఏర్పాటు చేయాలిని కోరారు.ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు అయిపోయిన ప్రాంతంలో ఉన్న క్వార్టర్ లలో  ఎవరు ఉంటున్నారో వారికే అప్పజెప్పాలన్నారు.కార్మికులకు ఉపయోగపడేటట్టుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నియోజకవర్గంలో ఒకటి కంపల్సరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు.   ప్రభుత్వం ఏర్పడి దాదాపు15 నెలలు అవుతున్న ప్రజలు, కార్మికులకు, న్యాయం చేసింది ఏమీ లేదన్నారు.ఇప్పటికైనా, ముఖ్యమంత్రి కార్మిక శాఖ మంత్రిని నియమించి, కార్మికులకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు . లేనట్లయితే టిఎన్టియుసి తరఫున పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.