ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలోని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్, ప్లానింగ్) జి.వెంకటేశ్వర రెడ్డి ఇల్లెందు ఏరియాలో బుధవారం పర్యటించారు. అనంతరం ఇల్లెందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో నూతన ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన జేకే ఉపరితల గనికి సంభందించి మొదటి దశ అనుమతులు వచ్చాయని తదుపరి అనుమతుల కోరకు చేయవలసిన పనుల వివరాలపై సంభందిత అధికారులకు దిశ నిర్దేశం చేశారు.
నూతన ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని తెలియజేస్తూ తగు సలహాలు సూచనలు చేశారు. అనంతరం వారిని గుర్తింపు సంఘం ఎ.ఐ.టి.యు.సి అధ్యకుడు వాసి రెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కే.రాజ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్ మర్యాద పూర్వకంగా కలిసి కార్మికుల సమస్య లపై వారితో చర్చించారు దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జియం జాన్ ఆనంద్, ఓయస్డి వి.కృష్ణయ్య, యస్ ఓ టూ జియం బొల్లం వెంకటేశ్వర్లు, డిజియం(పర్సనల్) మోహన్ రావు, ఎస్టేట్ అధికారి శివకుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.