calender_icon.png 6 February, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగమంతుల జాతర స్థలాన్ని పరిశీలించిన సింగరేణి అధికారులు

06-02-2025 05:17:42 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల సమీపంలోని రేగుల గండి అటవీ ప్రాంతంలో నిర్వహించే శ్రీ భవాని లింగమంతుల జాతర స్థలాన్ని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా అధికారులు ఎస్ఓటు జిఎం D శ్యాంసుందర్, ఏరియా ఇంజనీర్ (E&M) R శ్రీనివాస్ ఇతర అధికారులు గురువారం పరిశీలించారు. రేగుల గండి చెరువు దగ్గర నుండి జాతర జరుగు గుడి వరకు ఉన్న రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు.

జాతర సమయంలో మంచినీటి వసతి, లైటింగ్ సదుపాయంలను జాతర కంటే ముందు రోజే తప్పనిసరిగా కల్పిస్తామని హామినిచ్చారు. ఈ సందర్భంగా లింగమంతుల జాతర కార్యనిర్వాహన కమిటీ సభ్యులు అక్కడ వసతుల గురించి, గుడి పరిసర ప్రాంతాలలో తగిన సదుపాయాల గురించి అధికారులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, సూపర్వైజర్లు సైదులు, ప్రవీణ్, అజయ్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.