రామగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మొలుమూరు శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటనే సింగరేణి ఓబి కంపెనీలు బేఖాతారు చేస్తున్నాయని రామగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మొలుమూరు శ్రీనివాస్ అన్నారు. గురువారం రామగిరి లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం సింగరేణి కంపెనీలో ప్రైవేటు ఓబి కంపెనీల్లో వివిధ కంపెనీలో స్థానికులకు భూ నిర్వాసితులకు 90శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆర్డర్ ఇచ్చినా కూడా సింగరేణి యాజమాన్యం ఓబి కంపెనీలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.
స్థానికులకు డ్రైవర్లకు కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కంపెనీ అభివృద్ధి కోసం సర్వస్వం కూలిపోయిన వారికి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితులకు సింగరేణి ప్రభావిత గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల రమేష్, రాసమల్ల రమేష్, రంగం మధు, తాళ్ల రాజయ్య, కృష్ణ, నరేష్, అశోకులు పాల్గొన్నారు.