- సంస్థ దేశంలోనే అగ్రగామిగా నిలవాలి
- సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): సింగరేణి తెలంగాణ మణికిరీటమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులు, సిబ్బంది, అధికారులు, వారి కుటుంబసభ్యులకు సీఎం సోమవారం శుభాకాంక్షలు తెలిపారు.
135 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నదని, ప్రగతిప థాన సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. కార్మిక కుటుంబాల సంక్షేమం, సమున్నతికి పాటుపడుతూ, సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా.. దేశంలోనే అగ్రగామిగా నిలవాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
కన్యాకుమారికి వెళ్లిన సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి తమిళనాడులోని కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు. కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం సోమవారం అక్కడికి వెళ్లారు. మంగళవారం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. కాగా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.