calender_icon.png 23 December, 2024 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక సింగరేణి

23-12-2024 12:47:02 AM

  1. కార్మికులు, అధికారులకు ఆవిర్భావ శుభాకాంక్షలు
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): బొగ్గు ఉత్పత్తి ద్వారా ఇంధన అవసరాలను తీర్చుతూ సింగరేణి సంస్థ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకగా నిలుస్తోందని తెలిపారు.

సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భట్టి విక్రమార్క ఆ సంస్థ కార్మికులు, వారి కుటుంబసభ్యులకు ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఆరు జిల్లాల్లో లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారంగా ఉన్న సింగరేణిని..

కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా ఇతర రంగాలలోకి ప్రవేశించి మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.