- పనులకు అడ్డంకులు కలిగిస్తే బ్లాక్ లిస్టులోకే..
ఆర్జీ సమసిన కాంట్రాక్టర్ల వివాదం
రామగుండం/మంథని, జూన్29 (విజయక్రాంతి): సింగరేణిలో పెరుగుతున్న సివిల్ కాంట్రాక్టర్ల ఆగడాలపై యాజమాన్యం దృష్టి సారించింది. ఇటీవల రామగుండం డివిజన్ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టింది. ఇక మీదట సంస్థ పరమైన పనులకు అడ్డంకు లు కలిగిస్తే బ్లాక్ లిస్టులోకి చేర్చనున్నట్లు తెలిసింది. సింగరేణి ఆర్జీ పరిధిలోని ఐబీ కాలనీలో సీసీ రోడ్డు పనులకు యాజమాన్యం ఈళుబొటెండర్లు పిలవగా.. మంచిర్యాల జిల్లాకు చెందిన భూక్య రాజు అనే కాంట్రాక్టర్ పనులను దక్కించుకున్నాడు.
తమ మాట వినకుండా టెండర్‌లో ఎలా పాల్గొంటావంటూ గోదావరిఖనికి చెందిన పలువురు సివిల్ కాంట్రాక్టర్లు కక్ష పెంచుకుని.. మూడు రోజుల కిందట సైట్ మీదకు వెళ్లి పనులను అడ్డుకున్నారు. సూపర్‌వైజర్, కూలీల నుంచి పరికరాలను లాక్కొని కులం పేరుతో దూషించారు. భూక్య రాజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులుతోపాటు గోదావరిఖని వన్ టౌన్ సీఐ, సింగరేణి ఆర్జీ జీఎం, సింగరేణి కార్పొరేట్ సివిల్ జీఎం, విజిలెన్స్ జీఎంలకు ఫిర్యా దు చేశాడు.
స్పందించిన యాజమాన్యం రెండు రోజుల క్రితం సివిల్ కాంట్రాక్టర్ల ను స్థానిక కార్యాల యానికి పిలిచి చురకలంటించింది. ఇక మీదట సంస్థ పరమైన పనులకు అడ్డంకులు సృష్టించే వారిపై చర్యలతోపాటు బ్లాక్ లిస్టులో చేర్చుతామని హెచ్చరించినట్లు తెలిసింది.