calender_icon.png 19 November, 2024 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినూత్న వ్యాపారంలోకి సింగరేణి

19-11-2024 12:27:44 AM

  1. మిథనాల్ ఉత్పత్తి ప్రయోగం
  2. డిసెంబర్ 31 నాటికి ప్లాంట్ నిర్మాణం 

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాం తి)/రామగుండం: సింగరేణి సంస్థ వినూత్న వ్యాపారం ప్రారంభిస్తుంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంటును ఏర్పాటు చేసేందకు సిద్ధమైంది.

సింగరేణి విద్యుత్ కేంద్రంలో గొడ్డును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల పరిమాణం గల కార్బన్ డయోక్సైడ్‌ను సేకరించి, దీనిని హైడ్రోజన్ వాయువుతో కుదింపి చేసి, చివరిగా మిథనాల్ ద్రవాన్ని పొందే ప్రక్రియను ఈ ప్లాంట్‌లో చేపట్టనున్నారు.

ఈ ప్రయోగత్మ కంగా ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభ మైందని, డిసెంబర్ 31 నాటికి పూర్తవు తుందని సీఎండీ బలరామ్‌నాయక్ తెలిపారు. ఈ మిథనాల్‌ను వివిధ పరిశ్రమ లకు సింగరేణి సంస్థ అమ్మకునే అవకాశం ఉంది.

దేశీయ అవసరాల కోసం వినియో గిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనా ల్‌లో దాదాపు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటు న్నాం. దేశీయంగా ఉత్పత్తి దిశగా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయ వంతం అయితే భవిష్యత్‌లో ఏర్పాటు చేసే ప్లాంట్ల ద్వారా దేశానికి ఎంతో అర్థికంగా లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయని సీఎండీ బలరాం తెలిపారు.