గోదావరిఖనిలో సింగరేణి హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీలో అర్జీ-1 జీఎం లలిత్ కుమార్
రామగుండం,(విజయ క్రాంతి): సింగరేణి ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని, సింగరేణి ఏరియా ఆసుపత్రి క్యాంటీన్ ఆక్కస్మిత తనిఖీలో ఆసుపత్రి సిబ్బందికి రామగుండం ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ సూచించారు. సోమవారం గోదావరిఖని లోని సింగరేణి ఏరియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లకు అందించే భోజనాన్ని తనే స్వయంగా రుచిచూసిన జీఎం నాణ్యత బాగుందని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ రాజ్ కుమార్ ను కిచెన్ సిబ్బందిని అభినందించారు. ఏరియా ఆసుపత్రి వార్డులలో ఇన్ పేషంట్లను చికిత్స పొందుతున్న వారిని వసతుల గురించి అడిగి తెలుసుకొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంచి పౌష్టికాహారాన్ని పేషెంట్లకు అందిస్తామని, యాజమాన్యం తరఫున జనరల్ మేనేజర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది మాట్రాన్, నిర్మల కుమారి, డైటీషియన్ హెప్సి, కిషన్ క్లర్క్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.