calender_icon.png 18 March, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి హై స్కూల్ పదవ తరగతి వీడ్కోలు సమావేశం

17-03-2025 06:32:32 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు సింగరేణి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 2024-25 ఏడాది పదో తరగతి విద్యార్థిని, విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమములో ముఖ్య అతిధిగా సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ... 10వ తరగతి విధ్యార్ధులతో ముచ్చటించి పరీక్షా సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షా సమయానికి వారి సెంటర్ కి 20 నిమిషాలు ముందుగా వెళ్లాలని, అలాగే కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని తద్వారా తల్లిదండ్రులకు, పాఠాశాలకు, సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సాహించి తగు సలహాలు సూచనలు తెలియజేశారు. తరువాత పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వారి చేతుల మీదుగా హాల్ టికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ జాయింట్ సెక్రటరీ యై.సునీల్ ప్రధాన ఉపాధ్యాయులు బి.శ్రీనివాస్, ఇన్చార్జి స్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాద్యాయులు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.