calender_icon.png 27 October, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రమశక్తిని చాటితే సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు

18-09-2024 12:00:00 AM

ప్రజాపాలన దినోత్సవంలో సీఎండీ ఎన్ బలరాం

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సింగరేణిలో విధులు నిర్వర్తిస్తున్న యువత శ్రమశక్తిని చాటి తే కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీఎండీ బలరాం పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి భవన్‌లో ప్రజాపాలన వేడుకల్లో భాగంగా జెండాను ఎగరేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాపార విస్తరణ దిశగా వేగంగా ముందుకు వెళ్తోందన్నారు.

రానున్న రోజుల్లో రాజస్థా న్‌లో సోలార్ పవర్ ప్లాంట్, సింగరేణిలో మూసివేసిన ఉపరితల గనుల్లో పంప్డ్ స్టోరేజ్ ప్లాం ట్లు, ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్ సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతామన్నారు. 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టులతో సింగరేణి ఉజ్వల భవితకు పునాదులు వేస్తున్న ట్లు వెల్లడించారు. జీఎం ఎస్‌డీఎం సుభానీ, డీ రవిప్రసాద్ పాల్గొన్నారు.