calender_icon.png 26 November, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు ఏరియాలో పర్యటించిన సింగరేణి జి‌ఎం

11-11-2024 05:06:48 PM

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లెందు ఏరియాలో  జి‌ఎం (సెక్యూరిటి) చందా లక్ష్మినారాయణ సోమవారం విస్తృతంగా పర్యటించారు. కోయగూడెం ఉపరితల గని, జేకే5 ఉపరితల గనుల చేక్ పోస్ట్ లను అదే విధంగా ఏరియా లోని వి.టి.యస్ నందు సెక్యూరిటీ పరమైన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా పోస్టులలో రికార్డులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెక్యూరిటీ సిబ్బంది విధులు ఎంతో బాధ్యతాయుతమైనవని, ఎల్లప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేయాలని, భద్రతపరంగా సంస్థ యొక్క ఆస్తులను కాపాడాలని, అన్యాక్రాంతం కాకుండా అనునిత్యం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహించాలని, సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీ సమయంలో తమకు కేటాయించిన సెక్యూరిటీ పోస్టులను వదిలి బయటకు వెళ్ళరాదని, విధులలో కఠినంగా వ్యవహరించి సంస్థ ఆస్తులను కాపాడాలని తెలిపారు.

తదుపరి జి‌ఎం(సెక్యూరిటీ) గా నూతనంగా బాధ్యతలు స్వీకరించి ఇల్లందు ఏరియాకు మొదటి సారిగా వచ్చిన సందర్బంగా చందా లక్ష్మినారాయణను ఏరియా జీఎం జాన్ ఆనంద్ పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఏరియాలో నిర్వహిస్తున్న సెక్యూరిటీ పరమైన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓయస్డి వి.కృష్ణయ్య, డిజియం (పర్సనల్) జివి మోహన్ రావు, క్వాలిటీ అధికారి రామదాసు, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, గుర్తింపు సంఘం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.సారయ్య తదితరులు పాల్గొన్నారు.