calender_icon.png 12 February, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఉద్యోగిని ఔదార్యం..

11-02-2025 10:44:15 PM

విద్యాభ్యాస పాఠశాలకు 50 కేజీల బియ్యం వితరణ.. 

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సంతోష్ నగర్ ప్రాంతంలో గల శ్రీ విద్యాభ్యాస బాల వెలుగు పాఠశాలకు సింగరేణి ఉద్యోగిని రజిని వితరణ ఔదార్యాన్ని చాటుకున్నారు. సింగరేణి కాలరీస్ సత్తుపల్లి జెవిఆర్ ఓసి గనిలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దాసరి రజని తన తల్లి సరోజినీ జ్ఞాపకార్థం బాలవెలుగు పాఠశాలకు 50 కేజీల బియ్యాన్ని వితరణగా అందజేసి విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు. అనంతరం విద్యార్థులతో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నాజర్ పాషా మాట్లాడారు. ఎంతోమంది తమ కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో చనిపోయిన తన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆమె  విద్యార్థుల చదువులకు సహకారం అందించాలన్న రజని సంకల్పాన్ని ఆయన అభినందించారు. కోరారు, ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహకులు బి జగన్ మోహన్ రెడ్డి, పి కిరణ్, ఉపాధ్యాయులు, సిబ్బంది వై సుహాసిని దేవి, సోడి స్వాతి, కొమరం చంద్రకళ వి రాధ, చీమల సుజాత  తదితరులు పాల్గొన్నారు.