మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా పి.వి కాలనీ పోస్ట్ ఆఫీస్ ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికుడు(Singareni Employee) ధూళికట్ల సురేష్(42) గుండెపోటు(Heart Attack)తో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండె నొప్పి వస్తుందని సురేష్ అనడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నందు సురేష్ ను పరీక్షించిన వైద్య సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారన్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సురేష్ మృతి వార్త తెలిసిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) మంగళవారం ఉదయం మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మణుగూరు ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, నాయకులు గట్టయ్య యాదవ్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.