calender_icon.png 28 April, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతనాలు, చట్టబద్ధ హక్కులకై 29న సింగరేణిలో ధర్నాకు పిలుపు

27-04-2025 02:46:50 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల(Singareni contract workers) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29న సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసుల ముందు తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని జేఏసీ  పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా ఇల్లందు సి హెచ్ పి లో కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి.మోహన్ రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు అనుబంధం) రాష్ట్ర నాయకులు ఎండి. రాసుద్దీన్, తోడేటి నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీనివాస్, మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచడంలో కోల్ ఇండియా ఒప్పందాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 2012 JBCCI లో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు నిర్ణయించినప్పటికీ సింగరేణి యాజమాన్యం నేటికీ అమలు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు.

2022 సెప్టెంబర్ లో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేసారు. మేడే సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపునకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు. కావున సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29న సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఇల్లందు ఏరియా జిఎం ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను కార్మికులు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి వెంకటేశ్వర్లు,మోటార్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే.యాకూబ్ అలీ, మోరే వెంకటేశ్వర్లు, డీ.లాలు, పి.రమేష్,బి. బాలు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.