calender_icon.png 29 April, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సీఎంఓ కిరణ్ కుమార్ బెల్లంపల్లి ఆసుపత్రి విజిట్..

28-04-2025 07:18:17 PM

ఆసుపత్రిలో మెరుగైన వైద్యంపై హామీ..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డాక్టర్ రవి కిరణ్(Singareni Chief Medical Officer Dr. Ravi Kiran) ఆకస్మికంగా విజిట్ చేశారు. సీఎంవోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి సోమవారం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డివైసీఎం మధుకర్, ఆస్పత్రి స్టాఫ్ ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు. సిబ్బంది, వైద్యుల కొరత సమస్యలను విన్నవించారు. 

ఆస్పత్రికి పూర్వ వైభవం కల్పించాలి..

బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సింగరేణి సీఎంఓ డాక్టర్ రవికుమార్ ను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు కలిసి సన్మానించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రికి పురవైభవం కల్పించాలని కోరారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సందర్శించడానికి విచ్చేసిన కొత్తగూడెం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల ఓపిగ్గా విన్నారు. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్స్ ను ఫార్మసీ మెడికల్ సిబ్బంది కొరతను తీర్చాలనీ కోరారు.

వైద్య నిపుణులతో వారానికి ఒకసారి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కార్మిక కుటుంబాలకు తగిన వైద్య సదుపాయాలను కల్పించడానికి సీఎం హామీ ఇచ్చారు. సీఎంవో ను కలిసి వినతిపత్రం ఇచ్చిన వారిలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయుసీ) సెంట్రల్ సెక్రెటరీ మిట్టపల్లి వెంకటస్వామి, బ్రాంచ్ ఇన్చార్జి చెప్ప నరసయ్య, బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఆసుపత్రి ఫిట్ కార్యదర్శి డి ఆర్ శ్రీధర్, బ్రాంచి సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి ఉన్నారు.

ఆసుపత్రిలో సమస్యలు తీరుస్తా..

బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సింగరేణి సీఎంవో డాక్టర్ కిరణ్ కుమార్ ఆసుపత్రిలో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, ఆస్పత్రి డివైసిఎం మధుకర్ ఆసుపత్రి సమస్యలపై విన్నవించారు. అన్ని వైపుల నుంచి సమస్యలను తెలుసుకున్న సీఎంవో రెండు మాసాల్లో ఏరియాస్పత్రిలో వైద్యుల కోరత, ఫార్మసీ, వైద్య సిబ్బంది, ప్రధానంగా వైద్య నిపుణుల నియమకంపై చర్యలు తీసుకుంటానన్నారు. ఆస్పత్రిలో మెడికల్ పరమైన వైద్య పరికరాలను సమకూర్చుతానన్నారు.