రాజాపూర్ (విజయక్రాంతి): బాలానగర్ మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన సింగపోగు అంజయ్య కూతురు సింగపోగు దివ్య వరంగల్ ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్భంగా సింగరేణి సిఎండి బలరాం నాయక్ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్ లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో దివ్యను వారి కుటుంబ సభ్యులు సన్మానించారు. మెడిసిన్ మొదటి సంవత్సరం ఫీజుల నిమిత్తం 25,000/- ప్రోత్సాహకంగా అందజేశారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైద్య విద్యలో రాణించి కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తెవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.