calender_icon.png 12 February, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరాంపూర్‌లో పర్యటించిన సింగరేణి సీఎండీ బలరామ్

12-02-2025 04:35:24 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శ్రీరాంపూర్‌లో సింగరేణి సీఎండీ బలరామ్(Singareni CMD Balaram) బుధవారం పర్యటించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్మికులను చైతన్యపరచడమే లక్ష్యంగా ఆర్కే-5,6,7 ఇన్ క్లైన్లు, శ్రీరాంపూర్ ఓసీ, ఎస్ఆర్పీ సీహెచ్పీలను సందర్శించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. యంత్రాల వినియోగం, ఉత్పాదకత పెంచాలని, బొగ్గు ఉత్పత్తిలో రక్షణ, నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎండీ సూచనలు చేశారు. ఆర్కే గని క్యాంటీన్ లో కార్మికులతో కలిసి సింగరేణి సీఎండీ బలరామ్ అల్పాహారం చేసిన అనంతరం ఆర్కే న్యూటెక్ భూగర్భ గనిలో పని ప్రదేశాలను సందర్శించారు. అన్ని గనుల కార్మికులతో సీఎండీ బలరామ్ ముఖాముఖి నిర్వహించారు. మందమర్రి, బెల్లంపల్లి, రామగుండం గనులను సందర్శించనున్న సీఎండీ బలరామ్ పేర్కొన్నారు.