ఇల్లందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా ఆసుపత్రిని సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి.సుజాత ఆదివారం సందర్శించారు. ముందుగా ఏరియా జియం జాన్ ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా ఆసుపత్రి నందు రోజువారీ ఓపి వివరాలను, వార్డ్ రూమ్ లను, అత్యవసర విభాగాన్ని, ఇన్ పేషంట్, రిఫరీ కేసుల వివరాలను, ముందుల వివరాలు, స్టోర్ రూమ్ నందు నిల్వ వున్నా స్టాక్ వివరాలను, ఆక్సిజన్ మిషన్ ల పనితీరు, రోజువారి రక్త, ముత్ర పరీక్షల వివరాలను, x-రే గది రికార్డులను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వారు హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రోగులతో మాట్లాడి వారికీ అందుతున్న వైద్యం పై వారి నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారితో ఆప్యాయంగా మాట్లాడాలని, వారికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారికీ అందించే వైద్య సేవలలో ఎటువంటి అంతరాయం ఏర్పడిన సంబందిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తదుపరి వార్డ్ నందు అడ్మిట్ అయిన వారికీ వారే స్వయంగా వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ నరసింహరావు, క్లర్క్ అరుణ, సిస్టర్స్ గ్రేస్, సౌభాగ్య వేణి, వార్డ్ బాయ్ సలీం తదితరులు పాల్గొన్నారు.