calender_icon.png 7 February, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనియన్ల ఐక్యతతోనే సింగరేణి పరిరక్షణ

07-02-2025 05:52:38 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలోని అన్ని జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాల ఐక్యతతోనే సింగరేణి పరిరక్షణ సాధ్యమవుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు స్పష్టం చేశారు. ఏరియాలోని కాసిపేట-2 గనిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మికులు, యూనియన్లు ఐక్యంగా పోరాడవలసిన అవసరము ఉందన్నారు. ఆర్థికంగా పరిపాలనపరంగా సింగరేణి చాలా సంక్షోభంలో నెట్టబడిందని ఫలితంగా సంస్థ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ మనుగడతోనే కార్మికులు అధికారులకు ఉద్యోగ భద్రత ఉంటుందనీ, యూనియన్లు నిలదొక్కుకుంటాయని తద్వారా అనేక హక్కుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అధికారులు సంస్థ భవిష్యత్తు కొరకు పరోక్షంగా యూనియన్లు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల గత 20 సంవత్సరాలుగా లాభాలలో నడుస్తున్న సింగరేణికి ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పై స్థాయిలో డైరెక్టర్లు లేకపోతే విధానపరమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారని, పూర్తి స్థాయిలో డైరక్టర్లు లేకుండా ఎన్ని రోజులు సంస్థను నడుపుతారని ఆయన సింగరేణి యజమాన్యాన్ని ప్రశ్నించారు. విబేధాలు పక్కనపెట్టి యూనియన్లు కార్మికులు అధికారులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిలో ప్రస్తుతం చైర్మన్, డైరెక్టర్లు లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నదని, ఇది కంపెనీ మనుగడకే ప్రమాదమని, వెంటనే పూర్తి స్థాయిలో చైర్మన్ నిజాయితీ డైరక్టర్లను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. గెలిచిన సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టియుసి అందరినీ కలుపుకొని పోయి కంపెనీని కాపాడుకోవడం కోసం బాధ్యత తీసుకోవాలన్నారు. సంస్థ లాభాల నుండి డివిడెంట్లు తీసుకోవడంలో చూపే శ్రద్ధ సంస్థకు రావాల్సిన బకాయిలను ఇప్పించడంలో, కొత్త గనులను తెచ్చి సంస్థ భవిష్యత్తును కాపాడడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా గని పిట్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు బుద్దే సురేష్, ధనిశెట్టి సురేష్ ల నాయకత్వంలో ఓవర్ మెన్ కార్తీక్, సురేష్ ల ఆధ్వర్యంలో మైనింగ్ స్టాప్ తో పాటు వివిధ కేటగిరీల 15 మంది యువ కార్మికులు యూనియన్ లో చేరగా వారికి యూనియన్ ప్రధాన కార్యదర్శి వేజ్ బోర్డు సభ్యులు మంద నరసింహారావు యూనియన్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. చేరిన వారిలో మైనింగ్ స్టాఫ్ నుండి గడ్డం కార్తీక్, రమేష్, వెంకటస్వామి, నరేష్, సాగర్, శరన్, శ్రీశైలం, సంపత్, సురేందర్, వెంకటేష్, సాయి రాజు, చిలకయ్యలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి అల్లి రాజేందర్, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ చంద్రశేఖర్, ఆర్గనైజర్ విద్యాసాగర్, చైతన్య, నాగరాజు యాదవ్, రాజకుమార్, ప్రశాంత్, రమేష్, శివ, మనోజ్, ప్రదీప్, శ్రీనివాస్, రమేష్, ప్రశాంత్, అమీర్ లు పాల్గొన్నారు.