calender_icon.png 18 April, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శంగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే

11-04-2025 08:11:12 PM

మందమర్రి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ మహాత్మ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని, ముందుకు సాగాలని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్ అన్నారు. పట్టణంలోని సింగరేణి గ్రీన్ పార్క్ ఎదుట శుక్రవారం నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిరావు పూలే తన జీవితాంతం సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని, తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

మహనీయుల ఆశయాలు ముందుకు తీసుకుపోవాలంటే కేవలం చదువుతూనే సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ మంచిగా చదివి, జీవితంలో బాగుపడినప్పుడే వారికి నిజమైన నివాళులు అని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ... బీసీలు ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ కుమార్ ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సింగరేణి అధికారులు, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.