calender_icon.png 25 December, 2024 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిర్యానీ వండిన సింగపూర్ హైకమిషనర్

10-07-2024 05:03:28 AM

  • ఎక్కడ బెస్ట్ బిర్యానీ దొరుకుంతుందన్న సైమన్ 
  • బిర్యానీకి బెస్ట్ హైదరాబాద్ అంటూ నెటిజన్ల కామెంట్

సింగపూర్, జూలై 9 : హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ ప్రపంచవ్యాప్తం అయ్యింది. ప్రపంచ దేశాలు బిర్యానీని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ బిర్యానీ వండుతున్న వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఏ రాష్ట్రంలో బెస్ట్ బిర్యానీ దొరుకుంతుందో సూచించాలని నెటిజన్లను కోరారు. ఆ రాష్ట్రాన్ని త్వరలోనే సందర్శిస్తానని తెలిపారు. “నమస్తే ఇండియా! ప్రపంచ బిర్యానీ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిసారి బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఏ రాష్ట్రంలో ఉత్తమ బిర్యానీ దొరుకుతుందో చెప్పండి.

నేను ఆ రాష్ట్రాన్ని సందర్శించి బిర్యానీ రుచి చూస్తాను” అంటూ తాను స్వయంగా బిర్యానీ తయారు చేసిన వీడియో, ఫోటోలను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ఈ ట్వీట్ వెంట నే వైరల్‌గా మారింది. వావ్.. భలే ఉంది అని కొందరు కామెంట్ చేయగా.. మీ తొలి ప్రయత్నం సక్సెస్ అయ్యింది.. అద్భుతంగా బిర్యానీ తయారు చేశారంటూ మరికొందరు కామెంట్ చేశారు. హైదరాబాద్‌లోనే ఉత్తమ బిర్యానీ దొరుకుతుందని ఎక్కువ మంది నెటిజన్లు సూచించారు. కాగా, సైమన్ వాంగ్ 2020లో భారతదేశానికి హైకమిషనర్‌గా నియమితులయ్యారు.