లక్నో: గత కొద్ది రోజులుగా సరైన ఫామ్‌లో లేని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో బరిలోకి దిగుతోంది. నేటి నుంచిప్రారంభం కానున్న సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న సింధు.. చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
అప్పటి నుంచి ఒక్క టైటిల్ కూడా గెలవని సింధు ఈ టైటిల్ అయినా గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. మిగిలిన వారిలో యువ సంచలనం మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, రక్షిత శ్రీ, అనుపమ ఉపాధ్యాయ కూడా పోటీలో ఉన్నారు. వీరితో పాటు ఉన్నతి హుడా, ఇశ్రానీ బరుహా, దేవికా సిహగ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇక మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నా రు. ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌తో పాటు కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి, సతీశ్ కరుణాకరన్ బరిలో ఉన్నారు. డబుల్స్ కేటగిలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.