ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్-750 టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధూ 13-21, 21-16, 9-21తో ఇండోనేషియా ష ట్లర్ మార్సికా తంజంగ్ చేతిలో పరాజయం చవిచూసింది. దాదాపు గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన సింధూ రెండో గేమ్‌ను మాత్రం సొంతం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థికి గేమ్‌ను చేజార్చుకుంది. దీంతో డెన్మార్క్ ఓపెన్‌లో భారత్ కథ ముగిసినట్లయింది.