calender_icon.png 16 January, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధూ శుభారంభం

16-01-2025 02:07:46 AM

  1. ఇండియా ఓపెన్ టోర్నీ
  2. లక్ష్యసేన్, ప్రణయ్ ఓటమి

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్-750 టోర్నీ లో బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్‌లో అనుపమ తో పాటు డబుల్స్‌లో అశ్విని జోడీ రెండో రౌండ్‌కు చేరగా.. టాప్ సీడ్ లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి ఓటమి పాలయ్యారు. తొలి రౌండ్‌లో అనుపమ 21-17, 21-18తో రక్షిత శ్రీని ఓడించింది.

ఇక డబుల్స్‌లో అశ్వి ని జంట 21-11, 21-12తో భార త్‌కే చెందిన కావ్య గుప్తా- రాధిక శర్మ, రుతుపర్ణ- శ్వేత పర్ణ జోడీ 7-21, 21-19, 21-14తో ఫత్తిరిన్-సరిసా (థాయ్‌లాండ్)పై విజయా లు సాధించారు. సింగిల్స్‌లో లక్ష్యసేన్ మరోసారి నిరాశపరిచాడు. లక్ష్యసేన్ 15-21, 10-21తో చైనీస్ తైపీకి చెందిన చున్ లిన్ చేతి లో పరాజయం చవిచూశాడు. మరో సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణ య్ చైనాకు చెందిన లి యాంగ్ చేతిలో ఓటమి పాలవ్వగా.. ప్రియా న్షు కూడా తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు.

ఇక టోర్నీ తొలిరోజు తెలుగు తేజం పీవీ సింధూతో పాటు డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ శుభారంభం చేశాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధూ 21-14, 22-20తో సుంగ్ (కొరి యా)ను చిత్తు చేసి రెండో రౌండ్ చేరుకుంది. డబుల్స్‌లో సాత్విక్ జోడీ 23-21, 19-21, 21-16తో మాన్- టీ (మలేషియా) జంటను ఓడించింది. నేడు సింగి ల్స్‌లో సింధూతో పాటు డబుల్స్‌లో సాత్విక్ జోడీ మ్యాచ్‌లు జరగనున్నాయి.