calender_icon.png 23 October, 2024 | 2:59 PM

సింపుల్‌గా ఇలా చేస్తే చాలు!

17-06-2024 12:05:00 AM

మారుతున్న సీజన్ కారణంగా మన చర్మం పొడిబారటం, చీలికలు ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా పాదాల విషయంలో ఈ సమస్య తరుచుగా కనిపిస్తుంది. పాదాల రక్షణకై వంటింట్లోనే ఉండే పదార్థాలతో వాటిని అందంగా మార్చాలంటే కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..!

  • మూడు నిమ్మకాయలు, ఒక చెంచా చక్కెర, ఒక చెంచా బాదం నూనె, పది నుంచి పదిహేను పుదీన ఆకులు తీసుకోవాలి. 
  • పుదీన ఆకులు, నిమ్మకాయ ముక్కలను (తొక్కతో సహా) మిక్సీలో గ్రైండ్ చేయాలి. 
  • అందులో చక్కెర, బాదం నూనె కలిపితే పాదాలకు స్క్రబ్ రెడీ.
  • దీన్ని పాదాలు, మడమలు, వేళ్ల మధ్య పట్టించి ఆరిన తర్వాత చెత్తో ఐదు నుంచి పది నిమిషాల సేపు వలయాకారంగా మర్దన చేసి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. 
  • వర్షాకాలంలో పాదాలు నాని ఇన్ఫెక్షన్‌లు సోకకుండా ఉండటానికి ఈ స్క్రబ్‌లో చిటికెడు పసుపు కలుపుకోవాలి.